సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న "బ్రహ్మాస్త్ర" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో సెప్టెంబర్ రెండవ తేదీన సాయంత్రం ఆరింటినుండి జరగబోతుంది. విశేషమేంటంటే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో మైథలాజికల్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలకపాత్రలు పోషించారు. ఇంకా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె కూడా కీరోల్స్ లో నాకనిపించబోతున్నారని వినికిడి.