ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నేను మీకు బాగా కావాల్సినవాడిని" థర్డ్ లిరికల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 11:23 AM

"నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం నుండి ఇటీవలే నచ్చావ్ అబ్బాయ్ అనే సాంగ్ విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా, కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి కార్తిక్ శంక‌ర్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి థర్డ్ లిరికల్ 'అట్టాంటి ఇట్టాంటి' అనే మాస్ మసాలా పాటను ఆగస్టు 30వ తేదీన విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com