యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్, 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ జంటగా కొత్త దర్శకుడు గిరీశాయ తెరకెక్కించిన కొత్త చిత్రం "రంగరంగ వైభవంగా". DSP సంగీతం అందిస్తున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన సెమీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భీమవరం, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈ రోజు సాయంత్రం ఐదింటి నుండి నిర్వహించబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు.