మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొంచెంసేపటి క్రితమే "కార్తికేయ 2" టీంను కంగ్రాట్యులేట్ చేస్తూ హీరో నిఖిల్ కు స్పెషల్ ట్వీట్ చేసారు. థియేటర్ల గతించిన కళను తిరిగి తీసొచ్చేందుకు మంచి సినిమాలు సదా సహకరిస్తూనే ఉంటాయి... కార్తికేయ 2 గ్రాండ్ సక్సెస్ కు గాను మూవీ టీం మొత్తానికి కంగ్రాట్యులేషన్స్ ... అంటూ చెర్రీ ట్వీట్ లో పేర్కొన్నారు.
చెర్రీ ట్వీట్ కు ఉప్పొంగిపోయిన సంతోషంతో నిఖిల్ నిమిషాల్లోనే స్పందించి రీట్వీట్ చేసాడు. మీ దగ్గర నుండి కార్తికేయ 2 టీం కు విషెస్ రావడం మా అందరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.... అంటూ నిఖిల్ ట్వీట్ చేసాడు.
చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం ఇటు సౌత్ లో, అటు నార్త్ లో విడుదలైన ప్రతిచోటా భారీ కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa