ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవిశేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 11:37 PM

టైర్ 2 హీరోల్లో విభిన్న సినిమాలు చేస్తూ, డీసెంట్ హిట్లు కొడుతున్న యంగ్ హీరో అడవిశేష్ "మేజర్" సినిమాతో పాన్ ఇండియా హీరోగా గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు.
శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసిన ఆ చిత్రం జూన్ 3న పాన్ ఇండియా భాషల్లో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో సౌత్ లో క్రేజ్ పెంచుకున్న శేష్ నార్త్ లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
లేటెస్ట్ గా ఈ రోజు శేష్ తన నెక్స్ట్ మూవీ అప్డేట్ ను చూచాయగా ప్రేక్షకులకు తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ శేష్ స్పెషల్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ లో బర్త్ డే విషెస్ తో పాటు ఇంకా కొన్ని నెలల్లో సునీల్ నారంగ్ మరియు తన కాంబోలో మూవీ స్టార్ట్ కాబోతుందని తెలిపారు.
ప్రస్తుతానికి శేష్ చేతిలో హిట్ 2 సినిమా మాత్రమే ఉండగా, శశికిరణ్ తిక్కా - శేష్ కాంబోలో వచ్చిన గూఢచారి 2 కూడా స్క్రిప్ట్ దశలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa