మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై "హలో వరల్డ్" అనే కొత్త వెబ్ సిరీస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 12 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్, తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. 'సొంతం' ఫేమ్ ఆర్యన్ రాజేష్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జలదంకి శివసాయివర్ధన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సదా, రామ్ నితిన్, నిఖిల్ తదితరులు నటించారు. PK దండి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa