సాధారణంగా సినిమా కలెక్షన్స్ విషయంలో గ్రాస్, నెట్, షేర్ అనే పదాలు వాడుతుంటారు. కానీ, చాలా మందికి వీటి గురించి అవగాహన ఉండదు. మొత్తంగా అమ్మిన టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బును గ్రాస్ వసూళ్లుగా పరిగణిస్తారు. షేర్ అంటే గ్రాస్ వసూళ్ల నుంచి థియేటర్ల రెంట్, మెయింటెన్స్ ఛార్జీలను మినహాయిస్తారు. ఇక నెట్ అంటే గ్రాస్ వసూళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ తీసి లెక్కిస్తారు.