ప్రముఖ నటి తేజస్వి మదివాడ షాకింగ్ విషయం చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తను మద్యానికి బానిసయ్యానని చెప్పి షాకిచ్చింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత కౌశల్ తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. వారివల్ల చాలా ఇబ్బందిపడ్డానని, కౌశల్ ఆర్మీ కారణంగా ఏకంగా దేశం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందని, అందుకే మద్యం అలవాటు చేసుకున్నానని తెలిపారు. మద్యం వల్ల తన లుక్ పాడైపోయిందన్నారు.