ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమెకు విడాకులిచ్చి మరో మోడల్‌తో

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 25, 2018, 11:23 AM

శృంగార భామ మలైకా అరోరా, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ చాలా రోజుల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అర్బాజ్ ఖాన్ 1998 లో మలైకా అరోరాని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అర్హన్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్థలు ఏర్పడడంతో దాదాపు 19 ఏళ్ళ దాంపత్య జీవితం తరువాత 2017 లో ఈ జంట విడిపోయింది. బాలీవుడ్ లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. వీరిద్దరూ విడిపోయిన తరువాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


మలైకా నుంచి విడిపోయాక అర్భాజ్ ఖాన్ ఓ మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవడ్ మీడియాలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు జార్జియా ఆండ్రియాని. ఈ వార్తల గురించి సల్మాన్ ఖాన్ కుటుంబం స్పందించలేదు. సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ నిర్వహించిన గణేష్ చతుర్థి పూజలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. వీరితో పారు అర్భాజ్ ఖాన్ తనయుడు అర్హన్ కూడా ఉండడం విశేషం.జార్జియా మోడల్ గా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో చెలరేగుతుంటుంది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. జార్జియాతో కలసి తాను నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నట్లు అర్బాజ్ ఖాన్ అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించాడు.


జార్జియాతో డేటింగ్ గురించి స్యయంగా అర్బాజ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నా విడాకుల తరువాత చాలా వార్తలు వస్తున్నాయి. ఎవరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు అంతా అనుకుంటున్నారు. అవును. అది నిజమే. తాను, జార్జియా డేటింగ్ లో ఉన్నామని అర్భాజ్ ఖాన్ అంగీకరించాడు.ఇదిలా ఉండగా మలైకా అరోరా గురించి కూడా బాలీవుడ్ లో కథలు వినిపిస్తున్నాయి. యువ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య ఎదో జరుగుతున్నట్లు అంతా భావిస్తున్నారు. అప్పుడప్పుడూ వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకుని పబ్లిక్ గా కనిపించడం సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa