మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన అద్భుతమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ "దృశ్యం". 2013లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు, హిందీ భాషలలో అదే పేరుతో రీమేకై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఈ చిత్రానికి కొనసాగింపుగా దృశ్యం 2 గతేడాది విడుదలై, ప్రేక్షకులను మరింత థ్రిల్ చేసింది. తెలుగు, హిందీ భాషలలో దృశ్యం 2 రీమేకయ్యింది. లేటెస్ట్ గా దృశ్యం 3 పై మలయాళ మేకర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఒక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ దృశ్యం 3 ని అధికారికంగా ప్రకటించారు. 2023 లేదా 2024 వ సంవత్సరంలో విడుదలవుతుందని చెప్పారు.
దృశ్యం 1,2 లను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ మూడవ ఎడిషన్ కు కూడా డైరెక్ట్ చెయ్యనున్నారు. అనిల్ జాన్సన్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa