టాలీవుడ్ దర్శకుడు బాబీ తన తండ్రిని కోల్పోయాడు. బాబీ తండ్రి మోహనరావు ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. మోహనరావుకు 69 ఏళ్లు. ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. మోహనరావు అంత్యక్రియలు సోమవారం గుంటూరులోని శిగతపాలెంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, మోహనరావు మృతితో దర్శకుడు బాబీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa