ప్రస్తుతం బాలకృష్ణ NBK 107 షూటింగ్ నిమిత్తం టర్కీ లో ఉన్నారు. ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ టర్కీ షెడ్యూల్ లో బాలయ్యతో దిగిన లేటెస్ట్ పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసారు. దీంతో ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa