మహేష్ దర్శకత్వం సుధీర్ బాబు సినిమా సినీ కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ ప్రధాన కథాంశంతో సుధీరా భాబు ఓ సినిమా చేయబోతు న్నారు. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. 'హంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గన్ బుల్లెట్స్,బేడ ఈలు, ఈఫిల్ టవర్ చూపిస్తూ మోషన్ పోస్టర్ డిఫరెంట్ సాగింది. వాటి మధ్యలో సుధీర్ బాబు ముఖం కనిపి స్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ స్టోరీతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర కెక్కుతోంది. ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్ తో పాటు ప్రేమిస్తే భరత్ కీలక పాత్రలను పోషించనున్నారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.