తనదైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను గాయని సునీత సంపాదించుకున్నారు. సింగింగ్‌తో పాటు ఎంతో మంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. తరచూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఆమె టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలో అభిమానులకు తాజాగా ఆమె గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం (ఆగస్టు 29) నుంచి వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేస్తానని తెలిపింది.