కుర్ర హీరోయిన్ కృతి శెట్టి గ్లామర్ పరంగా రోజరోజుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. సినిమాల పరంగా పక్కనెడితే.. సోషల్ మీడియాలో మాత్రం లేత అందాలను విందు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఈ క్రమంలో క్రేజీ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ లో హంగామా చేస్తోంది. ఇటీవల కృతి తన అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా కాస్తా దగ్గరగానే ఉంటోంది. ఈ మేరకు అదిరిపోయే అవుట్స్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. ముఖ్యంగా బేబమ్మ చీరకట్టు అందాలకు అభిమానులు, ఫాలోవర్స్ మంత్రముగ్ధులవుతున్నారు. తాజాగా కుర్రభామ శారీలో మెరవడంతో కుర్రాళ్ల గుండెజారి గల్లంతవుతోంది.