ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ‌ర్విస్తూ సిగ్గు ప‌డుతున్నా..

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 25, 2018, 03:05 PM

ఎలాంటి వారసత్వం లేకుండా ఓ కుగ్రామం నుంచి బాలీవుడ్‌కు వచ్చింది కంగనా రనౌత్‌. ఒక్కో చిత్రాన్ని దక్కించుకుంటూ హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నాయికగా ఎదిగింది. ఈ క్రమాన్ని తాను పోరాడి సాధించుకున్నానంటోందీ భామ. మనసుకు అనిపించింది మాట్లాడేసి కంగనాకు దాచుకోవడం అనేది తెలియదు. ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పేస్తుంటుంది. కంగనా ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత కథ మణికర్ణికలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అవన్నీ దాటుకుని సినిమా పూర్తిచేశారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ….లక్ష్మిభాయ్‌ జీవితం పోరాటమయం.


ఈ చిత్రానికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సమయానికి కావాల్సిన నటీనటులు డేట్స్‌ కుదరలేదు. నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఇలా ప్రతి ఇబ్బంది వెనకా ఓ కథ ఉంది. అవన్నీ భరిస్తూ సినిమా చేశాం. ఇప్పుడు మేము సంబరాలు చేసుకునేందుకు కారణాలు ఉన్నాయి. ముందు ఇక ఆపేద్దాం అనుకున్నా…ఆ తర్వాత పట్టుదలగా ప్రయత్నించాం. నాకు జీవితంలో ఏదీ సులువుగా రాలేదు. ప్రతీది పోరాడే సాధించుకున్నాను. ఇందుకు ఒక విధంగా సిగ్గుపడుతున్నా, మరో విధంగా గర్విస్తున్నా. రేపు నా పిల్లలకు నాలాంటి కష్టాలు రాకూడదు. అని చెప్పింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa