గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినీ నిర్మాతలకు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ 2 సినిమాలకు పన్నురాయితీ తీసుకొని టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పన్నురాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సినీ నిర్మాతలకు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa