ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ బోల్డ్ ఫొటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఫోట్ షూట్ పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ ఒక స్వచ్ఛంద సంస్థ, మహిళా న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెంబూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ ఫిర్యాదుపై రణ్‌వీర్‌కు పోలీసులు నోటీసులివ్వగా నేడు పోలీసుల ఎదుట హాజరయ్యారు. మరోసారి కూడా ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది.