ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు, మీమ్స్‌తో అనసూయను నెటిజన్లు ఆటాడుకున్న విషయం తెలిసిందే. ఆంటీ అంటూ తనను ట్రోల్ చేయడంపై అనసూయ తీవ్ర అసహనానికి గురైంది. తనను కావాలనే ఆంటీ అంటూ అవమానిస్తున్నారని పేర్కొన్న అనసూయ.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అన్నట్టుగానే తాజాగా ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని అనసూయ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.