ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 2 నుండి ఆహాలో 'వాంటెడ్ పండుగాడ్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 02:52 PM

చాన్నాళ్ల తరవాత చాలామంది కమెడియన్స్ కలిసి ఒకే సినిమాలో నటించిన చిత్రం "వాంటెడ్ పండుగాడ్". శ్రీధర్ సీపాన డైరెక్షన్లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీని యునైటెడ్ కే ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది.
ఈ చిత్రం ఆగస్టు 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో మేకర్స్ ఈ మూవీని చాలా తొందరగానే డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేసారు. సెప్టెంబర్ 2 నుండి తెలుగు ఓటిటి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.  
సునీల్ , బ్రహ్మానందం, సప్తగిరి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సుడిగాలి సుధీర్, వర్షిణి, అనసూయ భరద్వాజ్, విష్ణు ప్రియ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఈ సినిమాను సమర్పించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa