వెంకట్ చంద్ర దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నటించిన 'డేగల బాబ్జీ' సినిమా మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఆహా ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డేగల బాబ్జీ OTTలో విడుదల చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తమిళ హిట్ చిత్రం ఒత్త సెరుప్పు సైజ్ 7 అధికారిక తెలుగు రీమేక్. యశ్రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వాతి ఎస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి లైనస్ సంగీతం అందించారు.