ప్రముఖ అమెరికన్ నటి, ఆస్కార్ విజేత జేన్ ఫోండా క్యాన్సర్ బారిన పడ్డారు. తనకు నాన్-హాడ్కిన్స్ లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఆమె కీమోథెరపీ చికిత్స ప్రారంభమైనట్లు ఆమె తాజాగా వెల్లడించింది. క్యాన్సర్‌ను ఓ టీచర్‌గా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. నాన్-హాడ్కిన్ లింఫోమా అనేది క్యాన్సర్. ఇది తెల్ల రక్త కణాలలో మొదలై శరీర రోగనిరోధక వ్యవస్థలోని అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంది.