అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారి సేవలో ఆమె పాల్గొన్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
Actress @janhvikapoor Visited Tirumala Srivari Temple at Friday #tirupati #tirupathi #tirumala #tirumalahills #jhanvikapoor #jahnavikapoor #sridevi #sridevikapoor #bollywood #tollywood pic.twitter.com/NkvFuWWeXa
— YSR Social Media Warriors (@iambhargavtej) September 3, 2022