నందమూరి కళ్యాణ్ రామ్ గత చిత్రం 'నా నువ్వే' భాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కొద్ది సమయం తీసుకుని ఆ చిత్ర నిర్మాతే ఐయాం మహేష్ కోనేరు నిర్మాణంలో మరొక సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గుహన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నివేత థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళి రోజులం రిలీజ్ చేయనున్నారు. అదే రోజున టైటిల్ ను కూడ ప్రకటించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ చివర్లో లేదా జనవరి ఆరంభంలో విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో కూడ కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa