ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ ఫోటో షూట్‌లతో తనలోని గ్లామర్ కోణాలను బయటపెట్టిన జాన్వి

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 29, 2018, 03:22 PM

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ అరంగేట్రం కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు ‘ధడక్’ చిత్రంతో అదిరిపోయే ట్రీట్ దొరికింది. అయితే ఆమె నుండి కోరుకున్న హాట్ అండ్ సెక్సీ మాత్రం ఆ చిత్రంలో లభించలేదు. అయితేనేం.. గ్లామర్ షో అంటే చెవికోసుకునే జాన్వీ కపూర్ ఫోటో షూట్‌లు, మూవీ ఫంక్షన్లు, ఫ్యామిలీ పార్టీలలో పొదుపుగా బట్టలేసి అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తుంటుంది. 


‘ధడక్’ చిత్రం తరువాత హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తనలోని గ్లామర్ కోణాలను బయటపెట్టిన ఈ బ్యూటీ తాజాగా వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్‌లో బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోస్తూ వీక్షకులు మతులు పోగొట్టింది. లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకు లేకుండా చేసింది.అయితే ఈ డ్రెస్‌లో అమ్మడు చాలా ఇబ్బంది పడింది. పదే పదే డ్రెస్‌ను సవరించుకుంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జాన్వీ హాట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక జాన్వీ పక్కనే ధడక్ హీరో ఇషాన్ ఖట్టర్ కూడా ఉండటంతో బాలీవుడ్‌లో కొత్త రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.


కాగా ‘ధడక్’ సినిమాలో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించింది జాన్వీ కపూర్. ఎక్కడా గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌ల జోలికి వెళ్లకుండా తొలి సినిమాలో జాన్వీని అందంగా చూపించడం మీదే శ్రద్ధపెట్టారు మేకర్స్. రాజస్థానీ స్టైల్ వస్త్రధారణతో ఆకట్టుకుంది. గ్లామర్ హంగులకు దూరంగా తొలిసారి తెరపై అలా కనిపించిన జాన్వీ, తను కేవలం అలాంటి పాత్రలకే పరిమితం కాదని తనలోని హాట్ నెస్‌ను ఇలా ఫోటో షూట్‌ల రూపంలో బయటపెడుతోంది. ఇకపోతే.. జాన్వీ నెక్స్ట్ మూవీ కూడా కరణ్ జోహార్ నిర్మాణంలో ఉంటుందని తెలుస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa