మాస్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాని ఎప్పటి నుంచో మహేష్ బాబుతో తీయాలని ఎన్నోసార్లు ఈ విషయాన్ని వెల్లడించిన పూరి జగన్నాథ్ ఈ సినిమాని మహేష్ బాబు తో తీయడానికి కుదరడం లేదు. ఈ క్రమంలోనే ఈ కథలో కొన్ని మార్పులను చేసి ఈ ప్రాజెక్టును విజయ్ దేవరకొండతో తీయడానికి పూరీజగన్నాథ్ అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇకపోతే ఈ సినిమా విజయ్ దేవరకొండతో చేస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైగర్ ఫెయిల్యూర్ తర్వాత విజయ్-పూరీ కాంబోలో వచ్చే జనగణమన చిత్రంపైనే ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ. జనగణమన మూవీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బడ్జెట్ సమస్యగా మారడమే కారణం. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ.. విజయ్, పూరీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa