ట్రెండింగ్
Epaper    English    தமிழ்

31 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవబోతున్నారా ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 02:16 PM

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్  సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంత మంది హీరోలు వచ్చినా రజినీ క్రేజ్‌ను ఏ మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. ‘తలైవా’ చివరగా ‘పెద్దన్న’ లో నటించాడు. ఈ చిత్రం యావరేజ్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. రజినీ ఈ మధ్యనే ‘జైలర్’ ను పట్టాలెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాకు ‘తలైవర్-170’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. తలైవర్-170’ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మేకర్స్ స్టార్ హీరో అరవింద్ స్వామి  ని సంప్రదించారట. ప్రస్తుతం అతడితో చర్చలు జరుపుతున్నారట. ఈ విషయంపై అరవింద్ స్వామి మాత్రం స్పందించలేదు. గతంలో వీరిద్దరు మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దళపతి లో నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఏ సినిమా చేయలేదు. ఒక వేళ ఈ వార్తలు కనుక నిజమైతే 31ఏళ్ల తర్వాత వీరిద్దరు కలసి చేయబోయే సినిమా ఇదే అవుతుంది. ఇక రజినీ ప్రస్తుతం నటిస్తున్న ‘జైలర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో జై, వసంత్ రవి, రమ్య కృష్ణ, తమన్నా భాటియా, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ‘జైలర్’ ఫస్ట్‌‌లుక్‌ ఈ మధ్యే విడుదలైంది. ఈ లుక్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa