కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన సూపర్ హిట్ చిత్రం "విక్రాంత్ రోణ" సెప్టెంబర్ 2 నుండి ప్రఖ్యాత ఓటిటి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఐతే, ఇది కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 16 నుండి ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విక్రాంత్ రోణ మూవీకి సంబంధించి లేటెస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలు పోషించారు. పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల సూపర్ పాజిటివ్ టాక్ తో, డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa