అక్కినేని అఖిల్ – దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక లవ్ స్టొరీ తెరకెక్కుతున్న మూవీ మిస్టర్. మజ్ను. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీ విశేషాల గురించి చిత్ర నిర్మాత మాట్లాడుతూ, “సినిమా అవుట్ పుట్ తో మేం హ్యాపీ. రెండు ఫైట్ సీక్వెన్సులు.. రెండు పాటల చిత్రీకరణ మాత్రం పెండింగ్ ఉంది. త్వరలో రిలీజ్ కు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం” అన్నారు. మొదట్లో ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ‘అంతరిక్షం.. ‘పడి పడి లేచే మనసు’.. ‘యాత్ర’ సినిమాలు అదే డేట్ కు రిలీజ్ అవుతున్నాయి. మరి డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. జార్జ్ సీ. విలియమ్స్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa