ప్రముఖ మోడల్, నటి అడ్రియానా లిమా తాను మూడవ బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. ఆగస్టు 28న ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా కొడుకుతో దిగిన ఫొటోలు పంచుకుంది. తన కొడుకుకు సియాన్ లిమా లెమ్మర్స్ అనే పేరు పెట్టినట్లు పేర్కొంది. సియాన్ తనకు ఎంతో ఇష్టమైన రంగుగా తెలిపింది. బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ లెమర్స్‌తో ఆమెకు సియాన్ మొదటి బిడ్డ. ఆమెకు అంతకు ముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు.