"బ్రహ్మాస్త్ర" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో తారక్ మరియు, రణ్ బీర్ కు సంబంధించిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ను జక్కన్న ప్రేక్షకులతో పంచుకున్నారు.
అదేంటంటే, ముంబైలో RRR ప్రమోషన్స్ జరుగుతున్న టైం లో జరిగిన సంఘటన ఇది. ఒక రూమ్ లో తారక్, రణ్ బీర్ ఇంకా మరికొంతమంది ప్రముఖులు కలిసి పార్టీ చేసుకుంటుండగా, తారక్ జక్కన్నను 'రాక్ స్టార్' మ్యూజిక్ ఆల్బం ను వినిపించమని రిక్వెస్ట్ చేశారట. రణ్ బీర్ కపూర్ సూపర్ హిట్ మూవీ రాక్ స్టార్. ఈ ఆల్బం లో వచ్చే ప్రతి పాట లిరిక్స్ ను పొల్లు పోకుండా తారక్ ఆలపించడం చూసి రణ్ బీర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడట. ఎందుకంటే ఆ సినిమాలోని పాటల లిరిక్స్ రణ్ బీర్ కి కూడా అంతగా రావు. కాశ్మీరీ హిందీ స్లాంగ్ లో ఉండే ఆ పాటల లిరిక్స్ ను భట్టి పట్టడం అంటే మాములు విషయం కాదు మరి ..