దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 పై అప్డేట్స్ కోసం వేకళ్ళతో నిరీక్షిస్తున్నారు. నటీనటుల ఆడిషన్స్ , ఆపై సింపుల్ పూజా కారక్రమంతో మొదలైన పుష్ప 2 అప్డేట్స్ లేటెస్ట్ గా రెగ్యులర్ షూటింగ్ వరకు వచ్చేసాయి. ఐతే, ఈ అప్డేట్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మండన్నా రివీల్ చేసారు.
రష్మిక మండన్నా హిందీలో నటించిన తొలి చిత్రం "గుడ్ బై" ట్రైలర్ నిన్న విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఈవెంట్ నిన్న ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ పుష్ప 2 షూటింగ్ పై రష్మిక బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఇంకా రెండు రోజుల్లో అంటే గురువారం నుండి పుష్ప 2 షూటింగ్ మొదలు కానుందని చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసింది.
సుకుమార్ డైరెక్షన్లో రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.