టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కెరీర్ లో 22వ సినిమాగా, కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తమిళ, తెలుగు భాషల్లో ఒక మూవీ రూపొందబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో చైతూకి జోడిగా కృతిశెట్టి నటిస్తుండగా, SS స్క్రీన్స్ నిర్మిస్తుంది.
ఇటీవలే ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా షురూ అయ్యాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ నెల్లోనే ఒక మంచి రోజున రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఐతే, ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావలసి ఉంది.
థాంక్యూ మరియు లాల్ సింగ్ చద్దా తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న చైతు, ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, గ్రాండ్ సక్సెస్ తో కం బ్యాక్ అవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.