మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు నిన్న ప్రకటించిన మేకర్స్ లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ టైంను కూడా ఫిక్స్ చేసారు. రేపు హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ఉదయం పదింటి నుండి జిన్నా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని అధికారికంగా తెలిపారు.
ఇందులో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇషాన్ సూర్య ఈ సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదలవబోతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.