ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ 'విక్రమ్ వేద' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 03:13 PM

నార్త్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న "విక్రమ్ వేద" ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఎక్జయిటింగ్ గా సాగింది. సైఫ్ మరియు హృతిక్ ల మధ్య వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూసేవారికి గూజ్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దానికి తోడు కిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ట్రైలర్ కట్టింగ్ అండ్ విజువలైజేషన్ చాలా బాగుంది. ఇప్పటికే ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ తో రెట్టింపయ్యాయి.
తమిళ సూపర్ హిట్ మూవీ "విక్రమ్ వేద" కు అఫీషియల్ హిందీ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేసారు. రాధికా  ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్ మరియు  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com