2001లో వచ్చిన "మనసంతా నువ్వే" సినిమాలో 'తూనీగ' పాట ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని కూడా బాగా పాపులరయ్యింది.
తాజాగా సుహాని పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యుజీషియన్ విభర్ హసీజాతో సుహాని పెళ్లి చేసుకుంది. విభర్ హసీజా మోటివేషనల్ స్పీకర్ కూడాను.
బాల రామాయణం సినిమాతో టాలీవుడ్ కి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన సుహాని కలిత ఆపై గణేష్, ప్రేమంటే ఇదేరా, నా హృదయంలో నిదురించే చెలి, ప్రేమించే మనసు, ఎదురులేని మనిషి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. హిందూస్తాన్ - ది మదర్ సినిమాకు గానూ సుహానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు వచ్చింది.