దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయం అవుతున్న కొత్త హీరో అభిరాం. దగ్గుబాటి రానా తమ్ముడే అభిరాం. క్రియేటివ్ డైరెక్టర్ తేజ డైరెక్షన్లో "అహింస" అనే సినిమాలో అభిరాం హీరోగా నటిస్తున్నాడు. ఇందులో గీతికా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి కొంచెంసేపటి క్రితమే ఫస్ట్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ వీడియోను బట్టి క్లియర్ గా అర్ధమవుతుంది... ఈ సినిమా కంప్లీట్ తేజ మార్క్ డిఫరెంట్ స్టోరీ అని. ఇప్పటివరకు ఎంతో మంది కొత్త నటీనటులు తేజ చేతుల మీదుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. వారిలో స్టార్ రేంజ్ కి ఎదిగిన యాక్టర్లు కూడా ఉన్నారు. మరి, అభిరాం ఫ్యూచర్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకుంటాడో చూడాలి.
ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.