సమంత నటిస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం "యశోద". ముందుగా ఈ రోజు సాయంత్రం యశోద టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ ఆ తరవాత ఈ రోజు మధ్యాహ్నానికి ముహూర్తం మార్చారు. లేటెస్ట్ గా మధ్యాహ్నం నుండి ఉదయం 10: 24 నిమిషాలకు యశోద టీజర్ రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇంకాసేపట్లోనే సమంత మనల్ని ఎలా భయపెడుతుందో చూడబోతున్నామన్నమాట.
హరి శంకర్, హరీష్ నారాయణ్ కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మెలోడీబ్రహ్మ మణిశర్మ గారు సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.