మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న RC 15 (వర్కింగ్ టైటిల్) లో డైరెక్టర్, విలక్షణ నటుడు Sj సూర్య నటిస్తున్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా మేకర్స్ SJ సూర్య తమ సినిమాలో భాగమే అంటూ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. స్పైడర్, డాన్ సినిమాలలో విలక్షణ నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సూర్య. ఆయన నటనకు తెలుగులో కూడా అభిమానులున్నారు.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.