సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న "అల్లూరి" మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణాలలో వారం రోజుల నుండి ప్రమోషనల్ టూర్ పేరిట అల్లూరి చిత్రబృందం వరస ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ ప్రమోషనల్ టూర్లో భాగంగా ఏడవ రోజున అంటే రేపు తిరుచానూరు, తిరుపతి, రైల్వే కోడూరులలో అల్లూరి ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి.
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.