పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "భీమ్లానాయక్". దగ్గుబాటి రానా ఇందులో విలన్గా నటించారు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.
అద్భుతమైన ధియేటర్ రన్ ఆపై ఓటిటి స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్ ఐన భీమ్లానాయక్ లేటెస్ట్ గా మరోసారి ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. అదేంటి అనుకుంటున్నారా ... తమిళ భాషలో భీమ్లానాయక్ సినిమా ఆహా తమిళ్ యాప్ లో రేపటి నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భీమ్లానాయక్ ఇకపై తమిళ ప్రేక్షకులను సైతం ఫిదా చెయ్యడానికి రెడీ అయ్యింది.