ధియేటర్ సందడి ఇంకా పూర్తిగా ముగియకముందే "సీతారామం" సినిమా డిజిటల్ రంగంలోకి ప్రవేశించబోతుంది. సెప్టెంబర్ 9వ తేదీ నుండి అంటే 8వ తారీఖు అర్ధరాత్రి నుండే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. సో, సీతారామం సినిమా మరి కొంచెంసేపటి లోనే అందరికి అందుబాటులోకి రానుంది. ఎవరైతే ఈ సినిమాను థియేటర్లో మిస్ అయ్యారో వారికిది సూపర్ ఛాన్స్.
హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ మరియు వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. రష్మిక మండన్నా, సుమంత్, భూమిక కీలకపాత్రలు పోషించారు.