పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా చాలా కొత్త అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒక భారీ విజువల్ వండర్ లా తెరకెక్కింది. అయితే ఇప్పటి వరకు కూడా సినిమాపై ఎలాంటి అప్డేట్ కూడా బయటకి రాలేదు.
అయితే ఈ ఫస్ట్ లుక్ అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరి ఈ ట్రీట్ ఊహించని లెవెల్లోనే ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఈ అక్టోబర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న దాని కన్నా మించే సాలిడ్ అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ కోసం ఎలాగో ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనికి మించి ట్రీట్ లాంటివి ఏమన్నా ప్రభాస్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.