కేరళ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఓనం పండుగను జరుపుకుంటారు. ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలల్లో, కేరళ ప్రజలు దాదాపు 10 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ పండుగ సందర్భంగా కేరళ ప్రజలు సంప్రదాయ దుస్తులతో విందు చేస్తారు. ఓనం పండుగ సందర్భంగా పూర్తి సంప్రదాయ దుస్తుల్లో ఇంటి ముందు రంగురంగుల పూల బొకేలు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. దీనిని 'పూకోలం' అంటారు. తాజాగా మీరా జాస్మిన్ అదే చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే యువ కథానాయికలు అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, మంజిమా మోహన్, మాళవిక మోహనన్ పూర్తి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పవన్ కళ్యాణ్ తో "గుడుంబా శంకర్" సినిమాలో నటించి యువకుల మనసు దోచుకున్న మీరా జాస్మిన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అఅంతా మర్చిపోతున్న సమయంలో రీ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది మీరా. ఒకప్పుడు హోమ్లీ లుక్స్ తో వెండితెరపై తనదైన ముద్ర వేసిన మీరా జాస్మిన్ తన లుక్ ను పూర్తిగా మార్చేసింది.. బొద్దుగుమ్మ కాస్తా నాజూకు భామగా మారి ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మీరా నాజూ అందానికి ప్రేక్షకుల ప్రపంచం ఫిదా అయిపోయింది. దీంతో మీరా జాస్మిన్ మళ్లీ ట్రెండ్ అయింది. పెళ్లయిన తర్వాత ఫిట్ నెస్ విషయంలో ఆమె ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో తాజాగా ఆమె ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది.