RC 15 షూటింగ్ కు బ్రేక్ పడడంతో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి క్వాలిటీ టైంను గడుపుతున్నారు. ఈ వీకెండ్ కి సరదాగా గడపడానికి అక్క సుష్మిత, చెల్లెలు శ్రీజ, వారి పిల్లలు, ఇంకా మరికొంతమంది స్నేహితులతో కలిసి తన సొంత చార్టర్ ఫ్లైట్ లో ఎక్కడికో వెళ్తున్నారు. వీరందరితో పాటు చెర్రీ పెంపుడు కుక్కపిల్ల రైమ్ కూడా ఈ ఫోటోలలో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో చెర్రీ క్లీన్ షేవ్ తో ఉండడం విశేషం.