పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు "వకీల్ సాబ్" వంటి గ్రాండ్ కంబ్యాక్ సక్సెస్ అందించిన డైరెక్టర్ వేణుశ్రీరామ్. అంతకుముందు వేణు ఓహ్ మై ఫ్రెండ్, MCA వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసారు. గతేడాదిలో విడుదలైన వకీల్ సాబ్ తదుపరి వేణు ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్టును ఎనౌన్స్ చెయ్యలేదు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, వేణు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చెయ్యబోతున్నాడని, ఆ ప్రాజెక్ట్ ను బ్యాంక్రోల్ చేసేది ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అని సోషల్ మీడియా టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో అధికారికంగా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఒక పాన్ ఇండియా సినిమా తదుపరి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో మరొక సినిమాకు కమిటయ్యాడు.