"స్వాతిముత్యం"తో టాలీవుడ్ ప్రేక్షకులకు ఇంకా హలో చెప్పకముందే ఆ మూవీ డెబ్యూటేన్ట్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండవ సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
కొంచెంసేపటి క్రితమే గణేష్ రెండవ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది. "నేను స్టూడెంట్ సర్ !" అనే యూనిక్ అండ్ క్యాచీ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ ను బట్టి గణేష్ ఇందులో స్టూడెంట్ గా నటిస్తున్నాడని అర్ధం అవుతుంది.
ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి డైరెక్టర్ కాగా, నాంది సతీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మహతీస్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.