2017లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'మిడ్ నైట్ రన్నర్స్' కి అఫీషియల్ రీమేక్ గా రూపొందున్న చిత్రం 'శాకిని డాకిని'. ఇందులో రెజీనా కస్సాండ్ర, నివేద థామస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మీకీ MC క్లీరి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన టీజర్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సురేష్ బాబు దగ్గుబాటి, సునీతా తాటి, హ్యూన్ వూ థామస్ కిమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.