రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటిరాక్షన్లో "ఆదిపురుష్" డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న బిగ్ సర్ప్రైజ్ రివీల్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎప్పటినుండో తీక్షణంగా ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
2020లో ఈ మూవీ ఎనౌన్స్ చెయ్యబడింది. 2021 చివర్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎనౌన్స్ చేసినప్పుడు విడుదలైన టైటిల్ పోస్టర్ తప్పించి ఇంకే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా నుండి ఇప్పటివరకు రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ఓం రౌత్ చేసిన తాజా ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తుంది.
కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. 500కోట్ల భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.