నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటిస్తున్న చిత్రం "కృష్ణ వ్రింద విహారి". ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతుంది. హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి కృష్ణ వ్రింద విహారి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. మరి, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరన్నది మేకర్స్ ఇంకా రివీల్ చెయ్యలేదు.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
![]() |
![]() |